Bangladesh rewriting textbooks: పాఠ్యపుస్తకాల్లో జాతిపిత చరిత్ర మార్చిన బంగ్లాదేశ్
Bangladesh Rewriting Textbooks on 1971 War: బంగ్లాదేశ్‌లో 1971 నాటి లిబరేషన్ వార్‌కు సంబంధించి ఇప్పటివరకు షేక్ ముజిబిర్ రెహమాన్‌ను బంగ్లాదేశ్ తమ దేశానికి స్వాతంత్య్రం సంపాదించిపెట్టిన జాతిపితగా చెప్పుకుంటోంది. కానీ కొత్తగా పాఠ్య పుస్తకాలను సవరిస్తూ ముజిబిర్ రెహమాన్ స్థానంలో జియాఉర్ రెహమాన్ పేరు చేర్చింది.
Bangladesh Rewriting Textbooks on 1971 War: బంగ్లాదేశ్‌లో చరిత్రను మార్చి రాసేందుకు తాత్కాలిక ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. 1971 నాటి లిబరేషన్ వార్‌కు సంబంధించి ఇప్పటివరకు షేక్ ముజిబిర్ రెహమాన్‌ను బంగ్లాదేశ్ తమ దేశానికి స్వాతంత్ర్యం సంపాదించిపెట్టిన జాతిపితగా చెప్పుకుంటోంది. కానీ కొత్తగా పాఠ్య పుస్తకాలను సవరిస్తూ ముజిబిర్ రెహమాన్ స్థానంలో జియాఉర్ రెహమాన్ పేరు చేర్చింది. జియాఉర్ రెహమాన్ బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం ప్రకటించిన నేతగా పాఠ్యపుస్తకాలను మార్చిరాసింది. ఇప్పటికే సవరణలు కూడా పూర్తయ్యాయి.
సాధారణంగా ఎవరైనా ఏదైనా గొప్ప విషయం సాధించినప్పుడు చరిత్రను తిరగరాయడం జరిగిందనే పోలిక వాడుతుంటారు. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం నిజంగానే తమ దేశ చరిత్రను మార్చిరాసింది. 2025 విద్యా సంవత్సరం నుండే ప్రాథమిక, ఉన్నత పాఠశాల చరిత్ర పుస్తకాల్లో, పాఠాల్లో ఈ మార్పు కనిపించనుంది. విద్యార్థుల చరిత్ర పుస్తకాల్లో ఎక్కడైతే "బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం" అనే పాఠ్యాంశాలు, ప్రస్తావనలు ఉన్నాయో... వాటిని ఇప్పుడు బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం పనిగట్టుకుని మార్చేసింది.
బంగ్లాదేశ్ నేషనల్ కరికులం అండ్ టెక్ట్స్‌బుక్ బోర్డ్ చైర్మన్ ప్రొఫెసర్ ఏకేఎం రియాజుల్ హసన్ ఈ వివరాలు వెల్లడించినట్లుగా డైలీ ఓ స్టార్ ఒక వార్తా కథనాన్ని రాసింది.