Israel-Hamas War: గాజాపై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయోల్.. వైమానిక దాడుల్లో 26 మంది దుర్మరణం

Update: 2025-01-03 03:04 GMT

Israel-Hamas War: గాజా స్ట్రిప్‌లోని హమాస్‌పై ఇజ్రాయెల్ సైన్యం మరోసారి విరుచుకుపడింది. వైమానిక దాడుల్లో 26 మంది చనిపోయారు. ఇజ్రాయెల్ ప్రకటించిన తమ భద్రతా అధికారులు, మానవతా మండలాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు హమాస్ తెలిపింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గురువారం గాజా స్ట్రిప్‌లో కనీసం 26 మంది మరణించారు.

బాగా చలిగా ఉందని గుడారాల్లోకి వెళ్లాము..వెంటనే భారీగా శబ్దాలు వినిపించాయి. ఇజ్రాయెల్ దాడులకు పాల్పడిందని మువాపి తీరప్రాంతా మానవతా జోన్ పై దాడి తర్వాత గాజా ప్రాంతంలోని ఓ వ్యక్తి జియాద్ అబూ జబల్ తెలిపారు. తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో పది మంది మరణించినట్లు తెలిపారు. ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ఇతర ప్రాంతాల్లో కలిపి మొత్తం 26 మంది మరణించినట్లు వెల్లడించారు.

అంతకుముందు ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడిలో హమాస్ ఉగ్రవాది హోసామ్ షావాన్‌ను కూడా హతమార్చింది. ఇంటెలిజెన్స్ ఆధారిత దాడిలో దక్షిణ గాజాలో హమాస్ అంతర్గత భద్రతా దళాల అధిపతి హోసామ్ షావాన్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. గాజాలోని ఐడిఎఫ్‌పై దాడుల్లో హమాస్ మిలిటరీ విభాగానికి చెందిన ఎలిమెంట్స్‌కు సహాయం చేయడానికి షావాన్ బాధ్యత వహించాడు.

కాగా గురువారం తెల్లవారుజామున జరిపిన వైమానిక దాడిలో గాజాలో పది మంది మరణించారు. వీరిలో ముగ్గురు పిల్లలు, హమాస్ ఆధ్వర్యంలోని పోలీసు బలగాలకు చెందిన ఇద్దరు ఉన్నత స్థాయి అధికారులు కూడా ఉన్నారు. మరణించినవారిలో గాజా పోలీసు జనరల్ డైరెక్టర్ మేజర్ జనరల్ మహమూద్ సలా, బ్రిగ్ జనరల్ హోసామ్ షాహ్వాన్ ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా ఇజ్రాయెల్ వైమానిక దాడులతో 24గంటల వ్యవధిలో 60మందికిపైగా మరణించినట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు. 

Tags:    

Similar News