Chinmoy Krishna Das: చిన్మయ్ కృష్ణదాస్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
చిన్మయ్ కృష్ణదాస్(Chinmoy Krishna Das) బెయిల్ పిటిషన్ ను చటోగ్రామ్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు తిరస్కరించింది.
చిన్మయ్ కృష్ణదాస్(Chinmoy Krishna Das) బెయిల్ పిటిషన్ ను చటోగ్రామ్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు తిరస్కరించింది. 2024, నవంబర్ 25న బంగ్లాదేశ్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన జైల్లో ఉన్నారు. బంగ్లాదేశ్ లో ఇస్కాన్ తరపున ఆయన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. బంగ్లాదేశ్ లో మైనార్టీలు, ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సాగిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమయంలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను ఆయన అవమానించారనే అభియోగాలు మోపారు. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేశారు.
చిన్మయ్ కృష్ణదాస్ తరపున వాదనలు వినిపించేందుకు న్యాయవాదులు ముందుకు రాలేదు. ఓ న్యాయవాది ముందుకు వచ్చినా అతనిపై దాడి జరిగింది.
గత ఏడాది నవంబర్ లో ఆయన అరెస్టైన సమయంలో కూడా చిట్టగ్యాంగ్ కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించింది. ఆ సమయంలో ఆయనను జైలుకు తీసుకెళ్లే సమయంలో హింస చెలరేగింది. చిన్మయ్ మద్దతుదారులు పోలీస్ వ్యాన్ ను చుట్టుముట్టారు. ఆ సమయంలో పోలీసులు లాఠీచార్జీ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో సైఫుల్ ఇస్లాం అనే న్యాయవాది మరణించారని బంగ్లాదేశ్ ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది.
చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుపై జరిగిన ఆందోళనలపై 2023 నవంబర్ 27న కొత్వాలి పోలీస్ స్టేషన్ లో మూడు కేసులు నమోదయ్యాయి.