New Orleans Attack: కొత్త సంవత్సరం నాడే విషాదం.. 10 మంది మృతి, 30 మందికి గాయాలు
New Orleans terrorist Attack, what is the motive behind New Orleans terrorist: అమెరికాలో కొత్త సంవత్సరం నాడే విషాదం.. న్యూ ఓర్లీన్స్ దాడిలో 10 మంది మృతి, 30 మందికి గాయాలు
New Orleans Attack latest news updates: అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో ఉన్న న్యూ ఓర్లీన్స్ సిటీలో కొత్త సంవత్సరం నాడే విషాదం నెలకొంది. న్యూ ఇయర్ వేడుకలతో రద్దీగా ఉన్న ప్రదేశంలో ఓ ట్రక్కు డ్రైవర్ జనంపైకి ట్రక్కును వేగంగా పోనిచ్చాడు. ఆ తరువాత ట్రక్కులోంచి కిందకు దిగి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 10 మంది చనిపోయారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. కెనాల్, బోర్బన్ వీధి కలిసే ఫ్రెంచ్ క్వార్టర్ ప్రదేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ట్రక్కు డ్రైవర్ కాల్పులకు తెగబడటంతో అక్కడే ఉన్న పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో నిందితుడు చనిపోయాడు. ఇది ఉగ్రవాదుల కుట్ర అయ్యుండవచ్చా అనే కోణంలో అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై న్యూ ఓర్లీన్స్ పోలీసు కమిషనర్ ఆనీ కిర్క్ ప్యాట్రిక్ మాట్లాడుతూ, ట్రక్కు డ్రైవర్ భారీ విధ్వంసం సృష్టించే కుట్రతోనే వేగంగా జనంపైకి పోనిచ్చినట్లు సీన్ చూస్తే అర్థమవుతోందన్నారు. ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ మంది మీదకు ట్రక్కు పోనివ్వాలని అతడు భావించినట్లు అనిపిస్తోందని ఆమె (New Orleans Police Commissioner Anne Kirkpatrick) చెప్పారు.