Oppo Find X8 Mini: ఒప్పో పెద్ద ప్లాన్.. ఫైండ్ ఎక్స్8 సిరీస్ నుంచి రెండు కొత్త ఫోన్లు..!
Oppo Find X8 Mini: Oppo తన Oppo Find X8 సిరీస్‌ని విస్తరించేందుకు సిద్ధమవుతోంది.
Oppo Find X8 Mini: Oppo తన Oppo Find X8 సిరీస్‌ని విస్తరించేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ ఇప్పటికే ఈ సిరీస్‌లోని రెండు ఫోన్‌లను నవంబర్ 2024లో విడుదల చేసింది. ఇప్పుడు Vivo X200 Pro Mini ఆధారంగా Oppo Find X8 Mini పేరుతో ఈ సిరీస్‌లో మూడవ మోడల్‌ను పరిచయం చేయడానికి బ్రాండ్ సన్నాహాలు చేస్తోంది. చైనీస్ టిప్‌స్టర్ ఈ ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లను లీక్ చేసింది.
Oppo Find X8 Mini Specificatiions
లీకైన స్పెసిఫికేషన్ల ప్రకారం ఈ ఫోన్ 6.31 అంగుళాల LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉండచ్చు, దీని రిజల్యూషన్ 1.5Kగా ఉంటుందని పేర్కొంది. ఇది కాకుండా, ఇది MediaTek డైమెన్సిటీ 9400 SoC చిప్‌సెట్‌తో రావచ్చు, ఇది ఇప్పటికే ఉన్న Find X8, Find X8 Pro మోడల్‌లలో కూడా ఉంది.
Oppo Find X8 Miniలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండచ్చు. ఇందులో Sony IMX9 సిరీస్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. ఇది కాకుండా 50-మెగాపిక్సెల్ 'హై-క్వాలిటీ' పెరిస్కోప్ జూమ్ కెమెరా,ఆప్టికల్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా ఉండే అవకాశం ఉంది. రాబోయే ఫోన్‌లో మెటల్ మిడిల్ ఫ్రేమ్, గ్లాస్ బాడీ ఉండచ్చు. ఇది వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇవ్వచ్చు.
లీక్‌ల ప్రకారం.. రాబోయే Oppo Find X8 Miniని Oppo Find X8 Ultraతో పాటు మార్చి 2025లో మార్కెట్లోకి వస్తుంది. Oppo Find X8, Oppo Find X8 Pro ఇప్పటికే నవంబర్ 2024లో భారతదేశంలో విడుదలయ్యాయి, దీని ప్రారంభ ధర రూ. 69,999, రూ. 99,999. అవి ఆండ్రాయిడ్ 15-ఆధారంగా ColorOS 15తో రన్ అవుతాయి. 16GB వరకు LPDDR5X RAM +512GB వరకు UFS 4.0 ఇంటర్నల్ స్టోరేజక కలిగి ఉంటాయి. రెండూ LTPO AMOLED డిస్‌ప్లేలతో వస్తాయి.