Flipkart Big Bachat Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచాట్ డేస్.. ఈ ఫోన్లపై భారీగా డిస్కౌంట్లు..!

Flipkart Big Bachat Days Sale
x

Flipkart Big Bachat Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచాట్ డేస్.. ఈ ఫోన్లపై భారీగా డిస్కౌంట్లు..!

Highlights

Flipkart Big Bachat Days Sale: కొత్త ఏడాదిలో ప్రారంభంలో ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచాట్ డేస్ సేల్‌ని ప్రారంభించింది.

Flipkart Big Bachat Days Sale: కొత్త ఏడాదిలో ప్రారంభంలో ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచాట్ డేస్ సేల్‌ని ప్రారంభించింది. ఈ సేల్ జనవరి 5 వరకు లైవ్ అవుతుంది. అంటే రేపు లాస్ట్ రోజు. ఈ సేల్‌లో అత్యంత ఖరీదైన ఫోన్‌లను కూడా సగం ధరకే కొనుగోలు చేయవచ్చు. ధరపై నేరుగా తగ్గింపు పొందడమే కాకుండా, బ్యాంక్ , ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 16 నుండి ఏ ఖరీదైన ఫోన్‌లు చౌకగా లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

iPhone 16

ఆపిల్ iPhone 16 ను భారీ తగ్గింపులతో కొనచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచాట్ డేస్ సేల్ సందర్భంగా రూ.79,900 ధర కలిగిన ఐఫోన్ 16 రూ.74,900కి విక్రయిస్తోంది. మీరు దాని ధరపై మరింత తగ్గింపును పొందాలనుకుంటే, మీరు ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌లపై అందుబాటులో ఉన్న ఆఫర్‌ల ప్రయోజనాన్ని పొందవచ్చు. UPI ద్వారా లావాదేవీలు చేస్తే రూ. 2000 వరకు తగ్గింపు పొందవచ్చు. ICICI క్రెడిట్ కార్డ్‌లపై రూ. 4000 వరకు తగ్గింపు లభిస్తుంది.

Vivo V40e

వివో V40E స్మార్ట్‌ఫోన్‌ను చౌకగా ఆర్డర్ చేయచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో Vivo V40E 8GB RAM +128GB వేరియంట్‌ ధర రూ. 26,999 . బ్యాంక్ ఆఫర్ కింద, రూ. 2500 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. దీని కారణంగా మీ ఫోన్ మరింత చౌకగా మారచ్చు. రూ.25 వేల లోపే కొనుగోలు చేయవచ్చు.

Motorola Edge 50 Neo

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మోటరోలా Edge 50 Neoని చౌకగా కొనచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ సేల్ సందర్భంగా ఈ ఫోన్ రూ. 9,000 తగ్గింపుతో లభిస్తుంది. ఈ ఫోన్ ధర 20,999. మీరు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి రూ. 1000 తగ్గింపు పొందవచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 1250, IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 1500 వరకు తగ్గింపు లభిస్తుంది.

Oppo K12x 5G

మీ బడ్జెట్ రూ. 15 వేల లోపు ఉంటే మీరు Oppo K12X 5Gని కొనుగోలు చేయచ్చు. దీని 6GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ రూ. 16,999కి బదులుగా రూ. 12,999కి అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్ కింద, Oppo K12X 5G అధిక తగ్గింపులతో పొందవచ్చు. మీరు 4000 రూపాయల వరకు తగ్గింపు ప్రయోజనాన్ని పొందవచ్చు, దీని వలన ఫోన్ చౌకగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories