Samsung Mobile Offers: అమెజాన్ బిగ్గెస్ట్ డీల్.. సగానికి పడిపోయిన సామ్‌సంగ్ 200MP కెమెరా ఫోన్ ధర
Samsung Galaxy S23 Ultra Mobile Offers: సామ్‌సంగ్ గెలాక్సీ S25 సిరీస్‌ను ఈ నెలలో లాంచ్ చేయనుంది. సామ్‌సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 12GB + 256GB వేరియంట్ ఫోన్ ధర రూ. 1.49 లక్షలు. అయితే ఇది అమెజాన్‌లో రూ. 79,999కి అందుబాటులో ఉంది.
Samsung Galaxy S23 Ultra Mobile Offers: సామ్‌సంగ్ గెలాక్సీ S25 సిరీస్‌ను ఈ నెలలో లాంచ్ చేయనుంది. ఈ లైనప్ జనవరి 22న జరిగే కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. దీనికి ముందు, కంపెనీ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా ధరలను భారీగా తగ్గించింది. ఈ ఫోన్ అమెజాన్‌లో అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఒకవేళ మీరు ఫ్లాగ్‌షిప్ మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడు సరైన అవకాశం లభించింది.
సామ్‌సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 12GB + 256GB వేరియంట్ ఫోన్ ధర రూ. 1.49 లక్షలు. అయితే ఇది అమెజాన్‌లో రూ. 79,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌పై అమెజాన్ దాదాపు 47 శాతం తగ్గింపును అందిస్తోంది. డిస్కౌంట్‌తో పాటు, నో-కాస్ట్ EMI, అనేక బ్యాంక్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీనితో కొనుగోలు చేసే వ్యక్తులు మరింత డబ్బు ఆదా చేసుకోవచ్చు. అమెజాన్ ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది.
Samsung Galaxy S23 Ultra Features
సామ్‌సంగ్ గెలాక్సీ S23 అల్ట్రాలో గొప్ప ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ AMOLED డిస్‌ప్లేతో వస్తోంది. ఇది 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. శక్తివంతమైన పనితీరు, సులభమైన మల్టీ-టాస్కింగ్ కోసం దీనిలో క్వాల్‌కమ్ స్నాప్‌గ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్ అమర్చారు. ఈ ఫోన్ 12GB+256GB, 12GB+512GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది.
కెమెరా గురించి చెప్పాలంటే, ఈ ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 200MP మెయిన్ లెన్స్, 10MP టెలిఫోటో లెన్స్, 10MP పెరిస్కోప్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. లాంచింగ్ సమయంలో ఈ ఫోన్ కెమెరా ఫీచర్స్ చాలా ఫేమస్ అయ్యాయి. ఈ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్ నేటికీ ఇతర కంపెనీల అనేక ఫ్లాగ్‌షిప్ మోడల్స్‌తో పోటీపడుతోంది. సరసమైన ధరలో గొప్ప ఫీచర్లతో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడు సరైన అవకాశం అని శాంసంగ్ చెబుతోంది.