నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో మృతి చెందారు. ఏప్రిల్ 3న ఆసుపత్రిలో ఎస్పీవై రెడ్డి చేరారు. అప్పటి నుంచి ఆయన చికత్స పొందుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన జనసేన తరపున నంద్యాల నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2014లో వైసీపీ తరపున ఆయన ఎంపీగా గెలుపొందారు.