గీతాఆర్ట్స్ నిర్మాణంలో సినిమాచేస్తున్న యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ వరంగల్ లో సందడి చేశాడు. హనుమకొండలో ఓ షోరూమ్ ఓపెనింగ్ కు వచ్చిన విజయ్ అభిమానులతో సరదగా గడిపాడు. ఈ సందర్భంగా తాను చేసుకుంటే వరంగల్ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో అభిమానులు కేరింతలు కొట్టారు. ఇక విజయ్ పెళ్లి గురించి ఎందుకు మాట్లాడాడు. విజయ్ మనసులో వరంగల్ అమ్మాయి ఉందా? ఉంటే ఆమె ఎవరు? అని టాలీవుడ్ సర్కిల్ ల్లో చర్చలు మొదలయ్యాయి. కాగా త్వరలో విజయ్ షార్ట్ ఫిల్మింలో యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ప్రజలకు నేరాలపట్ల అవగాహన కల్పించేందుకు ఓ షార్ట్ ఫిల్మిం రెడీ అయ్యింది. ఆ ఫిల్మింలో ఎన్టీఆర్, రాజమౌళి, విజయ్ దేవరకొండలు కనిపించనున్నారు.