అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ ఢం సంపాదించుకున్న విజయ్ దేవరకొండ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఓ ప్రచారం జరుగుతుంది. వరంగల్ ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో పాల్గొన్న సెన్సేషనల్ స్టార్ అభిమానులతో సందడి చేశాడు. అంతేకాదు పెళ్లి చేసుకుంటే వరంగల్ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. అనంతరం హన్మకొండ రాంనగర్‌లోని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇంటికి వెళ్లారు. వారు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రాబోయే తన సినిమా విశేషాలపై ఎర్రబెల్లి, విజయ్ సరదాగా మాట్లాడుకున్నారు.
ఇదిలా ఉంటే విజయ్ ఎర్రబెల్లితో భేటీ అవ్వడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని నెటిజన్లు అంటున్నారు. అయితే వారిలో కొద్దిమంది వచ్చే ఎన్నికల్లో ఎర్రబెల్లి తరుపున ప్రచారం చేస్తారని..మరి కొంతమంది టీఆర్ఎస్ పార్టీలో చేరతాడని చెవులు కొరుక్కుంటున్నారు. ఇక సన్నిహితులు మాత్రం వరుస సినిమాలో దూసుకుపోతున్న విజయ్ రాజకీయంలో ప్రవేశించి ఎవరికీ మద్దతుగా ప్రచారం చేయబోడని తేల్చి చెప్పారు.