దేవాలయాలకి వెళ్తే... పూజారి ప్రసాదం ఇవ్వడం కామన్. కానీ మండే ఎండలకు భక్తులకు చల్లదాన్ని సమకూరుస్తున్నారు అక్కడి పూజారి. యూపీలోని కాన్పూర్ దేవాలయంలో భక్తులకు చల్లని పానీయాలు, పండ్లను ప్రసాదంగా ఇస్తున్నారు. అంతే కాదు... ఏసీలు, కూలర్లతో చల్లని వాతావరణం సృష్టించారు. రోజురోజుకి సూర్యుడు... తాట తీస్తున్నాడు. సెగలు పుట్టిస్తూ జనజీవనాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాడు. ఈ దెబ్బతో మంచినీరు, చల్లని పానీయాలు, పండ్ల రసాలు, పుచ్చకాయ ముక్కలు తీసుకోవడం తప్పనిసరి. ఇలాంటివి ఇప్పుడు దేవాలయంలోనూ పంపిణీ చేస్తున్నారు.
యూపీలోని కాన్పూర్‌లో ఓ దేవాలయం ఉంది. శ్రీ సీతారాములు, ఆంజనేయుడు, గణేష్, దుర్గామాత... ఇలా సకల దేవతలు, దేవుళ్లు కొలువై ఉన్నారు. అయితే మామూలు రోజుల్లో ఇక్కడి వచ్చే భక్తులకు ప్రసాదాలు ఇస్తుంటారు. కానీ ఈ మండే వేసవిలో... భక్తులు చల్లగా ఉండాలని ఇక్కడి ఆలయ పూజారి వెరైటీగా పండ్లు, పండ్ల రసాలు, చల్లని పానీయాలను ప్రసాదంగా పెడుతున్నారు. భక్తులకు చల్లని పానీయలను ప్రసాదంగా ఇవ్వడమే కాదు... భక్తులను వేడి నుంచి రక్షణ కల్పిస్తున్నారు. ఆలయంలో ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేసి చల్లని వాతావరణం సృష్టించారు. దీంతో భక్తులు గుడిలో చల్లని వాతావరణంలో సేదతీరున్నారు.