ఏపీ ప్రతిపక్ష నాయకుడి పాదయాత్రకు విరామం ప్రకటించారు. అయితే జగన్ మాత్రం తన పార్టీ ఎంపీలతో సమావేశానికి ఏర్పాట్లు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా పాదయాత్రకి విరామం ప్రకటించినట్టు వైసీపీ నేతలు తెలిపారు. ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం గుంటూరు జిల్లా లో సాగుతోంది. నర్సారావుపేట నియోజకవర్గంలో వైఎస్ జగన్ పాదయాత్ర సాగిస్తున్నారు. ఆదివారం 120వ రోజు పాదయాత్ర ముప్పళ్లలో ముగిసింది. నరసారావుపేట నుంచి వైఎస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు.
ఆపై బరంపేట, బీసీ కాలనీ, ఇనప్పాలెం మీదుగా పాదయాత్ర ములకలూరు చేరుకుంది. అక్కడ పార్టీ జెండాను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఆపై మధ్యాహ్న భోజన విరామం తీసుకుని తిరిగి పాదయాత్రను ప్రారంచించారు. ములకలూరు, గొల్లపాడుల మీదుగా కొనసాగిన పాదయాత్రను వైఎస్ జగన్ ముప్పళ్లలో ముగించారు. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్ నేడు 12.5 కి.మీ నడిచారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఓవరాల్‌గా వైఎస్ జగన్ 1598.5 కి.మీ నడిచి ప్రజా సమస్యలు తెలుసుకుని వారికి భరోసా కల్పిస్తున్నారు.