నిన్నమొన్నటి వరకు కలిసే ఉన్నారు. కేంద్రంలో తమకు మద్దతు పలుకుతారని చంద్రబాబు ఊహించారు. కానీ అకస్మాత్తుగా ప్లాన్ రివర్స్ అవ్వడంతో కంగుతిన్నారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన సీఎం చంద్రబాబు ఎన్డీఏ పై విమర్శలు చేస్తూ వస్తున్నారు. అదే తరణంలో తాము ఒంటిరిగా పోటీ చేస్తే గెలుస్తామని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తాము గెలవడం ఖాయమని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు.
ఆ వ్యాఖ్యలపై 24గంటలు లోపే తమకు టీఆర్ఎస్ మద్దతుగా నిలుస్తుందని భావించిన చంద్రబాబుకు ఊహించని రీతిలో టీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో పసలేదని, తమ స్వార్ధం కోసమే టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని సూచించారు. పైగా ఈ పరిణామం చూస్తే… చంద్రబాబు ఎంత కుటిల రాజకీయాలకు తెరదీశారో ఏపీ ప్రజలు అర్ధం చేసుకుంటారని అంటున్నారు. నిజానికి చంద్రబాబు సైతం ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని ఊహించి ఉండరు. ఏపీలో టీడీపీ సెల్ఫ్ గోల్ చేసుకుంటోంది. చంద్రబాబు ఎన్డీఏ నుంచి వైదొలిగిన తర్వాత.. కేంద్రంపై అవిశ్వాసం పెట్టడం వల్ల ప్రయోజనం లేదు. కలిసి ఉన్నప్పుడు ప్రశ్నించి ఉంటే ఉపయోగం ఉంటుంది“ అన్నారు.
అదేసమయంలో బీజేపీ ని విమర్శిస్తున్న చంద్రబాబు ..ఎన్డీఏతో కలిసి పనిచేస్తే బాగుంటుందని అన్న చంద్రబాబు మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇన్నిరోజులు గుర్తుకురాని ఏపీకి ప్రత్యేకహోదా ఇప్పుడు ఎలా గుర్తుకు వచ్చిందని అన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విషయాన్ని కూడా తలసాని ప్రస్తావించారు. విజయసాయిరెడ్డి ఎవర్ని కలిస్తే చంద్రబాబుకి ఎందుకు ఓ ఎంపీగా ఆయనకు ప్రధానిని కలిసే అవకాశం ఉందని పునరుద్ఘాటించారు.