హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా కథల్ని బట్టి హీరోలు సినిమాలు తీస్తుంటారు. ఒక్కోసారి ఫ్లాప్ మూటగట్టుకున్న దర్శకుడితో రెండో సినిమా చేయాలంటే సంశయిస్తుంటారు. కానీ మహేష్ బాబు అలా కాదు. కాన్సెప్ట్ నచ్చింది . సినిమాకి కమిట్ అవుతున్నారు. గతంలో మహేశ్ -సుకుమార్ కాంబినేషన్‌లో ‘నేనొక్కడినే’ సినిమా విడుదలైంది. ఆ సినిమా డిజాస్టర్ ను మూటగట్టుకోవడంతో పాటు నష్టాల్ని మిగిలిచ్చింది. అయితే అదే దర్శకుడితో మరో సినిమా చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం మహేష్ బాబు కొరటా శివ దర్శకత్వంలో సినిమా చేస్తుండగా..సుకుమార్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో అతనితో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. కొరటాల, వంశిపైడిపల్లి తో మరో సినిమా చేస్తున్నాడు. ఈ రెండింటి తర్వాత సుకుమార్‌తో సినిమా చేసేందుకు మహేశ్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.