15వ ఆర్థిక సంఘం సిఫార్సుల విషయంలో.. కేంద్రంపై సమరాన్ని సిద్ధమయ్యాయి రాష్ట్రాలు. దీంతో పరిస్థితి సెంట్రల్ వర్సెస్ స్టేట్స్ గా మారింది. సీఎం చంద్రబాబు నేతృతంలో 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు అమరావతిలో సమావేశమయ్యారు. ఈ భీటీలో 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులపై చర్చిస్తున్నారు. కేంద్రం తీరును నిరసిస్తూ ఇప్పటికే ఒకసారి తిరువనంతపురంలో భేటీ అయిన 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు.. మరోసారి సమావేశమయ్యారు. సమాక్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని భావిస్తున్నారు. కేంద్రం పెత్తనంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
11 రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. రాష్ట్రాలకు తలసరి ఆదాయం లెక్కింపులో 1971 జనాభాను పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్రాలు సూచిస్తున్నాయి. ఆర్థిక లోటు భర్తీ చేయాల్సిన అవసరం లేదంటూ.. 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులపై రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్థిక సంఘం విధివిధానాలపై మండిపడుతున్న రాష్ట్రాలు.. కేంద్రం పెత్తనాన్ని నిలదీస్తున్నాయి.