త్రివిక్రమ్ శ్రీనివాస్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో కొత్త సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం ఎన్నో అంచనాల నడుమ త్రివిక్రమ్ డైరక్షన్ లో అజ్ఞాతవాసి సినిమా విడుదలై డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ల సినిమా అంటే అనేక సందేహాలు వచ్చిపడుతున్నాయి. కానీ ఎన్టీఆర్ మాత్రం పిచ్చ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఎన్టీఆర్ గతంలో ఫ్లాపులు మూటగట్టుకున్న పూరిజగన్నాథ్ కు అవకాశం ఇస్తే టెంపర్ సినిమా తీసి హిట్ ఇచ్చాడు. ఇక సర్ధార్ గబ్బర్ సింగ్ ప్లాప్ తీసిన బాబీకి ఛాన్స్ ఇస్తే జైలవకుశ బ్లాక్ బ్లాస్టర్ హిట్ ఇచ్చాడు. అయితే అజ్ఞాతవాసి డిజాస్టర్ తో ఉన్న త్రివిక్రమ్ తో సినిమా తీస్తే హిట్ కొట్టొచ్చనేది ఎన్టీఆర్ అభిమతం. ప్లాప్ మూటగట్టుకున్న డైరక్టర్లు సినిమా కోసం కసిగా వర్క్ చేస్తారు. అందుకే ఈ పరిస్థితులు అన్ని తెలిసిన ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా విషయంలో హ్యాపీ గా ఉన్నారట. ఇక త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ తో హిట్ కొట్టి విమర్శకుల నోళ్లు మూయించాలని అనుకుంటున్నారట.