రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వారు ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. ఏపీకి చెందిన సీఎం రమేశ్.. రాజ్యసభ సభ్యుడిగా తిరిగి ప్రమాణస్వీకారం చేశారు. అలాగే టీడీపీకి చెందిన కనకమేడల రవీంద్రకుమార్ తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికైన ఏపీకి చెందిన జీవీఎల్ నరసింహారావు కూడా తెలుగులోనే ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు వీరికి పెద్దల సభకు స్వాగతం పలికారు.