అంబేద్కర్ 127వ జయంతిని ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీతో పాటు అధికార, విపక్షాలకు చెందిన ముఖ్య నేతలు అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. బాబా సాహెబ్ కలలు కన్న సమాజం కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.