బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ రాసిన లేఖపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఇరుపార్టీలు లేఖలతో ఎన్నాళ్లు ఈ దాగుడు మూతలని ప్రశ్నించారు.
కొద్దిరోజుల క్రితం చంద్రబాబు అమిత్ షా కు లేఖ రాశారు. ఎన్డీఏ నుంచి ఎందుకు విడిపోవాల్సి వచ్చింది. అందులో బీజేపీ పాపం ఎంత..? ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై బడ్జెట్ లో ఎందుకు ప్రస్తావించలేదు. ప్రత్యేకహోదా ఎందుకు ఇవ్వడం లేదు..? ప‌్రత్యేక ప్యాకేజీలో ఏపీకి ఇచ్చిన నిధులెన్నీ..? ఇలా రకరకాల అంశాల్నీ లేవనెత్తిన బాబు ఎన్డీఏ ప్రభుత్వం ఏపీ కి చేస్తున్న అన్యాయంపై పునరాలోచించుకోవాలని సూచించారు. అయితే ఆ లేఖకు కౌంటర్ ఇచ్చిన అమిత్ షా . రాష్ట్రం ఎన్నినిధులిచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి ఏం చేశారు..? భవిష్యత్తులో ఏపీకి ఎలాంటి ప్రయోజనాల్ని చేకూర్చే విధంగా బీజేపీ ఎలాంటి ప్రణాళికను సిద్ధం చేసింది. కేంద్రం హోదాలో రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆ లేఖపై స్పందించిన పవన్ కల్యాణ్ టీడీపీ - బీజేపీ లపై మండిపడ్డారు. హోదా ఇచ్చే స్థితిలో బీజేపీ, సాధించే స్థితిలో టీడీపీ లేవని అమిత్ షా, చంద్రబాబు లేఖలను బట్టి అర్థమవుతోందన పవన్ కల్యాణ్ అన్నారు. టీడీపీ- బీజేపీ వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రత్యేక ోదా తప్ప మరోటి వినే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో కమిటీ వేసి నిధుల కేటాయింపు, ఖర్చులపై లెక్కలు తేల్చాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. తాజా పరిస్థితిపై వామక్షాలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.
ఇదేలేఖపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తాము మద్దతిస్తే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమిత్ షా సంధించిన లేఖపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.
బీజేపీ అబద్ధాలతో రాజకీయం చేస్తున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యల్ని ఖండించిన సోము వీర్రాజు. టీడీపీ ఎన్ని లేఖలు రాసినా స్పష్టత ఇచ్చేందుకు సిద్దంగా ఉన్న పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదాపై రోజుకో మాట మాట్లాడుతున్న టీడీపీ నిజంగా తెలుగు డ్రామా పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు