అయ్యా..మీరు దేవుడ‌య్యా

Update: 2018-01-14 17:15 GMT

క‌ష్టాల్లో ఉన్నార‌ని తెలిస్తే ముందువెనుక ఆలోచించ‌కుండా సాయం చేసే గొప్ప‌గుణం ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఉంద‌నే చెప్పుకోవాలి. అలా బ‌య‌టే కాదు సినిమాల్లో కూడా అంతే ఔదార్య‌న్ని ప్ర‌ద‌ర్శిస్తారు. ప్ర‌తీనిర్మాత‌కు మంచి హిట్ అవ్వాల‌నే గుణం ఉన్న జ‌న‌సేనాని అందుకు చేయాల్సిన ప్ర‌య‌త్నాల‌న్నీ చేస్తాడు. ఒక్కోసారి ఆ ప్ర‌య‌త్నాల‌న్నీ బెడిసికొట్టి ప్లాపులు మూట‌గ‌ట్టుకోవాల్సి వ‌స్తుంది. అయినా నిర్మాత‌ను సేఫ్ చేసేందుకు రెమ్యూన‌రేష‌న్ త‌గ్గించేస్తాడు.
అలా త్రివిక్ర‌మ్ కాంబినేషన్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ 25వ సినిమా 'అజ్ఞాతవాసి విడుద‌లైంది. అయితే క్రేజీ కాంబినేష‌న్ లో సినిమా పై ఎన్నో అంచ‌నాలు ఉంటాయి. ఆ అంచ‌నాల్ని అందుకోలేక బాక్సాఫీస్ వ‌ద్ద ఢీలా ప‌డిపోయింది. దీంతో స‌ద‌రు చిత్ర నిర్మాత , డిస్టిబ్యూట‌ర్లు న‌ష్ట‌పోకూడద‌నే ఉద్దేశంతో తాను తీసుకున్న మొత్తంలో రూ.15కోట్లు తిరిగి ఇస్తున్న‌ట్లు ఫిల్మిం న‌గ‌ర్ లో చ‌క్కెర్లు కొడుతుంది. ఇక ప‌వ‌న్ బాట‌లో త్రివిక్ర‌మ్ కూడ త‌న రెమ్యూన‌రేష‌న్ త‌గ్గిస్తార‌ని అంటున్నారు నెటిజ‌న్లు. అయితే సినిమా సంగతి అటుంచితే పవన్ ప్రదర్శిస్తున్న ఈ ఉదార భావానికి సంతోషంలో మునిగితేలుతున్నారు మెగా అభిమానులు.

Similar News