రాజ్యసభను రేపటి(బుధవారం)కి వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. 15నిమిషాల వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో అదే పరిస్థితి నెలకొంది. టీడీపీ, అన్నాడీఎంకే ఎంపీలు సభలో నినాదాలు కొనసాగించారు. కావేరు బోర్డు ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే ఎంపీలు సభలో నినాదాలు చేశారు. ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీలు సభలో ఆందోళన చేపట్టారు. సభ సజావుగా జరగాలని చైర్మన్ కోరినప్పటికీ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో సభను బుధవారానికి వాయిదా వేశారు.