సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి బీహెచ్ లోయా మృతి కేసులో స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన అన్ని పిటిషన్లనూ సుప్రీంకోర్టు కొట్టివేసింది. మెరిట్ ప్రాతిపదికగా పిటిషన్లు కొట్టివేస్తున్నట్టు జస్టిస్ చంద్రచూడ్ తన తీర్పులో తెలిపారు. స్వప్రయోజనాలను ఆశిస్తూ దాఖలైన పిటిషన్లను ఎంతమాత్రం ఆమోదించేది లేదంటూ స్పష్టం చేశారు. కింది కోర్టుకు చెందిన నలుగురు జడ్జిల స్టేట్‌మెంట్లను అనుమానించేందుకు ఎలాంటి కారణాలు కనబడటం లేదని, లోయాది సహజమరణమేనని కోర్టు విశ్వసిస్తోందని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొంటూ స్వతంత్ర దర్యాప్తు కోరుతూ వేసిన పిటిషన్లను కొట్టివేశారు.