21వ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు ఈ రోజు స్వర్ణాల పంట పండింది. భారత క్రీడాకారులు మూడు స్వర్ణాలు, ఓ రజతాన్ని కైవసం చేసుకున్నారు. మహిళల బాక్సింగ్ 48 కేజీల విభాగంలో మేరికోమ్ స్వర్ణాన్ని దక్కించుకోగా ... 52 కిలోల బాక్సింగ్ విభాగంలో గౌరవ్ సోలంకి మరో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. 50 మీటర్ల షూటింగ్ లో రాజ్‌పుత్ స్వర్ణాన్ని దక్కించుకోగా బాక్సింగ్ పురుషుల 49 కిలోల విభాగంలో అమిత్ రజతాన్ని సాధించాడు. దీంతో భారత్ ఇప్పటి వరకు 20 స్వర్ణాలు, 12 రజతాలు, 14 కాంస్యాలు దక్కించుకుని మూడో స్ధానంలో కొనసాగుతోంది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్ ఫైనల్‌కు చేరుకోగా పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ తుది పోరుకు చేరుకున్నారు.