హాస్పిటల్ లో చేరుతున్నారా? తస్మాత్ జాగ్రత్త

Update: 2018-04-29 18:00 GMT

అది ప్రభుత్వ దవాఖానా కావొచ్చు. ప్రయివేట్ కార్పొరేట్ హాస్పిటల్ కావొచ్చు. ప్రముఖుల పేరు మీద కట్టిన సేవా దృక్పథంతో నడిపిస్తున్న వైద్య సంస్థ కూడా అయి ఉండొచ్చు. అది ఎంత పెద్దది అయినా సరే. చికిత్స కోసం హాస్పిటల్ లో చేరబోయేందుకు వెళ్తే మాత్రం జాగ్రత్త పడండి. లేదంటే.. ముంబైలో పరమీందర్ కు పట్టిన గతే మీకూ పట్టొచ్చు. పరమీందర్ కు పట్టిన గతిని ఓ సారి తెలుసుకోండి.

గత మార్చిలో పరమీందర్.. ముంబైలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. 40 రోజులపాటు చికిత్స ఇచ్చిన తర్వాత కూడా మార్పు రాలేదు. చివరికి కోమాలోనే అతడిని జనరల్ వార్డుకు తరలించారు. బాల్ థాక్రే ట్రామా కేర్ హాస్పిటల్ లోని జనరల్ వార్డులో ఈ నెల 21 నుంచి ఆయన చికిత్స పొందుతూనే ఉన్నాడు. కానీ.. కలలో కూడా ఊహించని ఓ ఘోరం.. పరమీందర్ కుటుంబానికి తెగ ఆందోళన తెచ్చిపెట్టింది.

కోమాలో ఉన్న పరమీందర్ ను.. ఎలుకలు కొరికాయి. అతని కంటి నుంచి తీవ్రంగా రక్తస్రావం కావడంతో తండ్రి గుప్తా.. వెంటనే డాక్టర్లను నిలదీశాడు. తాను ఎలుకలను చూశానని వాగ్వాదానికి దిగాడు. అయినా.. డాక్టర్లు పెద్దగా స్పందించలేదు. తమ హాస్పిటల్ పేరు పాడు చేసేందుకే ఇలా చేస్తున్నారని.. ఎలుకల సమస్యే లేదని తేల్చి చెప్పారు. దీంతో.. విధిలేని పరిస్థితుల్లో కొడుకు కోసం గుప్తా వెనక్కు తగ్గాల్సి వచ్చింది.

ఇది నిజమో కాదో మనం చూడలేదు కాబట్టి స్పష్టంగా ఏదీ చెప్పలేం. కానీ.. ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తపడాలంటే.. హాస్పిటళ్లలో ఉన్న వసతులు, ఏర్పాట్లపై మరింత అలర్ట్ గా ఉండాల్సిన అవసరమైతే చాలా ఉంది.

Similar News