కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగింది. ఏప్రిల్ 17న నోటిఫికేషన్ విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం. అదే రోజు నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది. 224 స్థానాలున్న కర్ణాటకలో సింగిల్ ఫేజ్‌లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓం ప్రకాశ్ రావత్ తెలిపారు. మే 12 పోలింగ్ నిర్వహించి15న ఫలితాలు ప్రకటించనున్నట్లు సీఈసీ వెల్లడించారు. 24వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించి 25న స్క్రూటినీ, 27న నామినేషన్లను విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.