టెలికాం రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన 'జియో' వినియోగ దారులకు సరసమైన ధరలతో వివిధ ఆఫర్లు ఇస్తూ మార్కెట్లో తన సత్తా ఏంటో నిరూపించుకుంది. ఇక జియో దెబ్బకు ఇతర టెలికాం సంస్థలు కూడా దిగివచ్చి వారి కస్టమర్లను కాపాడుకుంటున్నాయి. ఇందులో ముఖ్యంగా ఐడియా ఎయిర్టెల్ ముందువరుసలో ఉన్నాయి. ఇప్పటికే వివోఎల్టీఈ ని అందుబాటులోకి తీసుకువచ్చాయి. జియో , ఎయిర్టెల్ , వోడాఫోన్ లు తాజాగా (వాయిస్ ఓవర్ ఎల్టీఈ) వివోఎల్టీఈ సేవలను ప్రారంభించనున్నట్టు ఐడియా తెలిపింది. దీంతో వినియోగదారులు వీవోఎల్టీఈ సేవలు ఐడియాలో కూడా పొందే అవాకాశం ఐడియా సెల్యూలర్ నెట్వర్క్ కల్పించింది. వీవోఎల్‌టీఈ సేవల వల్ల వినియోగదారులు ఓ వైపు హైస్పీడ్ మొబైల్ డేటా సేవలను ఆస్వాదిస్తూనే మరో వైపు అత్యంత నాణ్యమైన హెచ్‌డీ వాయిస్ కాల్స్‌ను చేసుకోవచ్చని ఐడియా తెలిపింది. ఈ ఆఫర్ ను కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేసింది. మే 2 నుంచి ప్రారంభం కానున్న ఈ సేవలు మహారాష్ట్ర అండ్ గోవా, గుజరాత్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, మధ్యప్రదేశ్ అండ్ చత్తీస్‌గఢ్ సర్కిళ్లలో ప్రారంభమవుతాయని ఐడియా తన బ్లాగుల్లో పేర్కొంది. కాగా ఈ ఫీచర్ వివోఎల్టీఈ సపోర్ట్ చేసే హ్యాండ్ సెట్లలో మాత్రమే పనిచేస్తుంది.