గవర్నర్‌కు ఢిల్లీ నుంచి ఆకస్మిక పిలుపు

Update: 2018-04-24 05:55 GMT

తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఈరోజు మధ్యాహ‌్నం ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్న గవర్నర్‌‌ రెండ్రోజులపాటు కేంద్ర పెద్దలను కలవనున్నారు. ముఖ్యంగా ప్రధాని మోడీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీకానున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పాలన, రాజకీయ పరిస్థితులపై కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులతో సమావేశమైన గవర్నర్‌‌ రెండు రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలు, ఇతర అంశాలను తెలుసుకున్నారు. అయితే ఇటు టీఆర్‌ఎస్‌ సర్కార్ అటు టీడీపీ ప్రభుత్వం రెండూ కూడా కేంద్రంపై పోరుబాట పట్టడంతో గవర్నర్‌ ఢిల్లీ టూర్‌ ఆసక్తికరంగా మారింది. 
 
ఇటీవల కేంద్ర ఐబీ అధిపతి, ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి కేంద్రానికి నివేదికలు ఇవ్వడంతో గవర్నర్‌ను ఆకస్మికంగా ఢిల్లీ పిలిచినట్లు తెలుస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులపై ఇప్పటికే నివేదికలు సిద్ధంచేసుకున్న గవర్నర్‌ నర్సింహన్‌‌ ప్రధాని మోడీకి అందజేసే అవకాశం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో గవర్నర్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Similar News