మీప‌ని మీరు చేసుకోండి..చంద్ర‌బాబుకు చేదు అనుభ‌వం

Update: 2018-03-27 12:25 GMT

ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కావాలంటూ అఖిల ప‌క్ష స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో చంద్ర‌బాబుకు చేదు అనుభ‌వం ఎదురైన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ అఖిల‌ప‌క్ష స‌మావేశానికి టీడీపీతో పాటు లెఫ్ట్ పార్టీలు, ఉద్యోగ సంఘాలు నేత‌లు కూడా హాజ‌ర‌య్యారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా, రైల్వేజోన్ త‌దిత‌ర అంశాల‌పైచ‌ర్చ‌లు జ‌రిగాయి. 
ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబుకు చేదును అనుభ‌వం ఎదురైంది. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా, రైల్వేజోన్ పై అంద‌రం క‌లిసి పోరాటం చేద్దామ‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. చంద్ర‌బాబు పిలుపును వ్య‌తిరేకించిన సీపీఎం మ‌ధ్య ఆ స‌మావేశం నుంచి అర్ధాంతరంగా బ‌య‌ట‌కు వ‌చ్చారు.
 అనంత‌రం మీడియాతో మాట్లాడిన మ‌ధు చంద్ర‌బాబు క‌లిసిపోరాటం చేద్దామ‌ని చెప్పిన‌ట్లు తెలిపారు. మ‌రి నాడు ఏపీకి ప్ర‌త్యేక‌హోదా వ‌ద్దు, ప్ర‌త్యేక ప్యాకేజీ కావాల‌ని డిమాండ్ చేసిన చంద్ర‌బాబు నేడు మాట మార్చి ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కోసం పోరాటం చేద్దామ‌ని పిలుపునివ్వ‌డం విడ్డూరమ‌ని అన్నారు. గతంలో తాము హోదా కోసం పోరాడితే జైల్లో పెట్టారని గుర్తు చేశారు. కాబట్టే అఖిల ప‌క్ష‌స‌మావేశంలో చంద్ర‌బాబు పిలుపును వ్య‌తిరేకించి తీర్మానం వద్దని చెప్పామని మధు అన్నారు. మీతో కలిసి పోరాటం చేయలేమని చెప్పామన్నారు. మీ పని మీరు చూసుకోండి, మా పని మేం చూసుకుంటామని చంద్రబాబు ఎదుటే చెప్పామన్నారు. 
 చేసిన పాపాలన్నీ చేసి నాలుగేళ్ల తర్వాత ఇలాగా అన్నారు. తల్లిదండ్రులను చంపిన ఓ వ్యక్తికి శిక్ష పడితే, అతను కోర్టులో తనకు తల్లిదండ్రులు లేరని, శిక్ష వేయవద్దని కోరినట్లుగా చంద్రబాబు తీరు ఉందని ఎద్దేవా చేశారు.
 విభజన హామీల విషయంలో బీజేపీది ఎంత తప్పు ఉందో, టీడీపీది అంతే ఉందని, రెండు పార్టీలదీ సమాన పాత్ర అని మధు అన్నారు. ఒక్క కేంద్రం పైనే నిందలు వేయడం సరికాదన్నారు. పార్లమెంటు చేసిన చట్టాన్ని బీజేపీ అమలు చేయడం లేదన్నారు. టీడీపీ నాలుగేళ్లుగా ఆ పార్టీని వెనుకేసుకొచ్చిందని అభిప్రాయపడ్డారు.
  

Similar News