ప్రధాని మోడీకి కావేరీ నిరసనల సెగలు తాకాయి.. చెన్నైలో జరిగే డిఫెన్స్ ఎక్స్‌పోను ప్రారంభించేందుకు మోడీ వచ్చారు. అయితే, ఆయన రాక సందర్భంగా ఉదయం నుంచే చెన్నైలోని తమిళ సంస్థలు కావేరి డిమాండ్‌పై ప్రదర్శనలకు దిగాయి. నల్లజెండాలతో ప్రధాని మోడీకి నిరసన తెలిపేందుకు తమిళ గ్రూపులు ప్రయత్నించాయి. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.. అలాగే, ఎయిర్ పోర్ట్‌తోపాటు పలు కీలక ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.