సంక్రాతి బరిలో విడుదలైన అజ్ఞాతవాసి సినిమా కలెక్షన్లు దారుణంగా ఉన్నట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సినిమా విడుదలైన తొలిరోజు నుంచి అజ్ఞాతవాసి అభిమానుల్ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. దీంతో వసూళ్లు తగ్గినట్లు తెలుస్తోంది. తొలిరోజు నాన్ బాహుబలి రికార్డులను క్రాస్ చేస్తే రెండో రోజు నుంచి సినిమా వసూళ్ల పరంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో, రెస్టాఫ్ ఇండియాలో పాతిక కోట్లు, యూఎస్ ప్రీమియర్స్ లో ఫస్ట్ డే కలుపుకుని దాదాపు పది కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా రెండో రోజున ఇండియాలో ఐదు కోట్లు, ఓవర్సీస్ లో మరో ఐదు కోట్లు రూపాయల వచ్చినట్లు టాక్ . సినిమాపై అంచనాలు తగ్గడంతో వెంకటేష్ , పవన్ కల్యాణ్ మధ్య జరిగే సీన్లను యాడ్ చేస్తే అజ్ఞాతవాసి ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ ఆకట్టుకుటుందని చిత్రయూనిట్ భావించింది. కానీ జైసింహా, గ్యాంగ్ , రంగుల రాట్నం సినిమా విడుదలతో ఆ అవకాశాలు సన్నగిల్లాయని సమాచారం. ఇక నేడు రేపు.. పండగ సందడి. మెజారిటీ ఏరియాల్లో జనాలు థియేటర్ల వైపు వెళ్లడం తగ్గుతుంది. కాబట్టి.. పవన్ కల్యాణ్ సినిమా భారీ కలెక్షన్లు సాధించే అవకాశాలు లేవని ట్రేడ్ పండితులు అంటున్నారు.