వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కీలక పదవి

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కీలక పదవి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కీలక పదవి

Update: 2019-10-10 01:54 GMT

లోక్ సభలో తెలుగు ఎంపీలకు కీలక పదవులు దక్కాయి. అందులో అతిపెద్ద పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద పీట లభించింది. బుధవారం పలు కమిటీలకు చైర్మన్లను ప్రకటించారు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ఈ మేరకు సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ గా నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును నియమించారు. ఈ కమిటీలో తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమకుమార్ రెడ్డిని సభ్యుడిగా నియమించారు. అలాగే పార్లమెంట్ లైబ్రరీ కమిటీ చైర్మన్ గా తెలంగాణకు చెందిన ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఇతర కమిటీల్లోనూ సభ్యులుగా ఏపీ ఎంపీలకు స్థానం దక్కింది. ఇప్పటికే విజయసాయిరెడ్డి వాణిజ్య వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ గా ఉండగా.. తాజాగా రఘురామకృష్ణంరాజుకు ఈ పదవి దక్కడం విశేషం. కాగా లోక్ సభలో బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే పార్టీల తరువాత అత్యధిక సభ్యులున్న పార్టీగా తృణమూల్ తో కలిసి వైసీపీ నాలుగో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News