షోకాజ్ నోటీసు అందింది.. జవాబు ఇస్తాను : వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఆ పార్టీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. పార్టీ ఎమ్మెల్యేలపై అనుచితవ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ దీనిపై వారంరోజుల్లోగా వివరణ ఇవ్వాలని సూచించింది. దీనిపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కు ఆ పార్టీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. పార్టీ ఎమ్మెల్యేలపై అనుచితవ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ దీనిపై వారంరోజుల్లోగా వివరణ ఇవ్వాలని సూచించింది. దీనిపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు విజయసాయరెడ్డి ఇచ్చిన షోకాజ్ నోటీస్ అందిందని చెప్పారు.
గతంలో తాను మాట్లాడిన మాటల పేపర్ కటింగ్ లను జత చేసి పంపించారు. తాను ఎప్పుడూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అనుకూలంగా మాట్లాడలేదు... హైకోర్టు తీర్పును మాత్రమే సమర్దించాను అని ఆయన అన్నారు.
రేపే షోకాజ్ నోటీస్ కు రిప్లై ఇస్తానని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..'' నా గెలుపులో 90శాతం జగన్ పాత్ర ఉందని, 10 శాతం మాత్రమే నా పాత్ర ఉంది. నేను 7 శాతం మెజారిటీతోనే గెలిచాను..కాబట్టి నేను అభ్యర్థిగా ఉన్నాను కాబట్టే గెలిచాను అంటున్నాను.నేను విజయసాయి రెడ్డికి పంపే రిప్లైను సీఎం జగన్మోహన్ రెడ్డికి చేరవేస్తే ఎలాంటి చర్యలు ఉండవని అనుకుంటున్నాను. నా రిప్లైను అధినేతకు చూపించకుండా సస్పెండ్ చేస్తే ఏమి చేయలేను అని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.
నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే కుమిలి పోతాను.. నాకు జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ఇష్టం. నా దిష్టిబొమ్మను దగ్ధం చేస్తే పోలీసు కేసు పెట్టమన్నా పెట్టలేదు. ప్రాణ భయంతో ఒక ఎంపీగా లోకసభ స్పీకర్ ను ప్రొటెక్షన్ అడిగాను అని చెప్పారు.
సీఎంను కలవడానికి అవకాశం రావట్లేదని, ఒకవేళ కలిస్తే తిరుపతి భూములు, నియోజకవర్గ పరిధిలోని సమస్యలు చెప్పాలి అనుకున్నాను ఒక ప్రభుత్వ ప్రతినిధిగా నేను చేసిన పనులు మా ప్రభుత్వానికి నచ్చాయని అనిపించింది.. కానీ మా పార్టీ కి నచ్చలేదు. నేను నా రిప్లై లో అదే విషయం చెబుతాను.. సీఎం జగన్ నన్ను సస్పెండ్ చేయరు అనుకుంటున్నాను.. నేను ఇచ్చిన విందు కు కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ వచ్చారు అనేది కూడా షోకాజ్ నోటీస్ లో ఒక పేజీలో ఉంది. అలా కేంద్ర మంత్రులు రావడం తప్పుకాదు..కేంద్ర హోంశాఖామంత్రి అమిత్ షా కూడా విందుకు రావాల్సి ఉంది..చివరి నిమిషంలో ఆగిపోయింది' అని వైసీపీ ఎంపి రఘురామ కృష్ణంరాజు అన్నారు.
ఎంపీ రఘురామకృష్ణంరాజు ఒక ఛానల్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. తమపై అసభ్య పదజాలంతో దూషించారని ఎమ్మెల్యేలు వైసీపీ క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేశారు. దాంతో అధిష్టానం ఈ చర్యలు చేపట్టింది. కాగా గత కొన్ని రోజులుగా రఘురామకృష్ణంరాజు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.వైసీపీ ఎంపీగా ఉంటూ.. ప్రభుత్వంపైనే అవినీతి ఆరోపణలు చేశారు, అంతేకాదు పార్టీలో పదవులు ఒక సామాజికవర్గం వారే పంచుకుంటున్నారని ఆరోపించారు. వీటన్నిటిపై ఫిర్యాదు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని అన్నారు.