ఆ విషయం నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. వైసీపీ ఎమ్మెల్యే అంబటి సవాల్

మహిళల కోసం జగన్ సర్కార్ మరో పథకం తీసుకొచ్చింది. 'వైఎస్సార్‌ కాపు నేస్తం' పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ పథకాన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు.

Update: 2020-06-24 14:21 GMT

మహిళల కోసం జగన్ సర్కార్ మరో పథకం తీసుకొచ్చింది. 'వైఎస్సార్‌ కాపు నేస్తం' పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ పథకాన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. అయితే దీనిపై ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాపు నేస్తం పథకంపై టీడీపీ విమర్శలుపై ఎమ్మెల్యే అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.

కాపులను అన్ని రాజకీయ పార్టీలు వాడుకున్నాయిని అంబటి అన్నారు. చంద్రబాబు కాపులను అనేక రకాలుగా మోసం చేశారని ఆరోపించారు. ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి చంద్రబాబు ఐదేళ్లలో రెండు వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని అంబటి విమర్శించారు. కాపుల పట్ల రాక్షస స్వభావంతో చంద్రబాబు పని చేశారని, కాపులపై చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టించారని ఆరోపించారు. కాపులను నమ్మించి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని వదిలేశారు అని దుయ్యబట్టారు. కాపులను అన్యాయంగా జైళ్లలో పెట్టించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. చంద్రబాబు కాపుల గొంతు కోశారని బోండా ఉమా బహిరంగంగా చెప్పారని గుర్తుచేశారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు అండగా ఉందని అంబటి అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కాపుల సంక్షేమం కోసం పని చేస్తున్నారని ప్రశంసించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు అనేక పథకాలు ద్వారా లబ్దిపొందారని చెప్పారు. అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారులకు చెంతకు పథకాలు అందుతున్నాయి అని చెప్పారు. కాపు సంక్షేమపై టీడీపీ నేతలతో బహిరంగ చర్చకు తాము సిద్ధమని చెప్పారు. కాపులకు ఇచ్చిన హామీలను టీడీపీ అమలు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని అంబటి సవాల్ చేశారు. కాపులకు ద్రోహం చేసేది టీడీపీ, కాపులకు న్యాయం చేసేది వైస్సార్సీపీ అని అన్నారు. 

Tags:    

Similar News