VAT increased on petrol in AP: వినియోగదారులకు ఏపీ షాక్.. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంపు!
VAT increased on petrol in AP: కరోనా పుణ్యమాని పనుల్లేక అల్లాడుతున్న మద్యతరగతి ప్రజలపై ఏపీ ప్రభుత్వం వ్యాట్ పేరుతో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
VAT increased on petrol in AP: కరోనా పుణ్యమాని పనుల్లేక అల్లాడుతున్న మద్యతరగతి ప్రజలపై ఏపీ ప్రభుత్వం వ్యాట్ పేరుతో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆదాయం పేరు చెప్పి, తీసుకున్న ఈ నిర్ణయంతో మద్య తరగతి ప్రజలకు అదనపు భారం పడుతుంది. ఇటీవల కాలంలో సాధారణ మధ్యతరగతి వారంతా ఎక్కడికి వెళ్లాలన్నా చిన్నపాటి మోటార్ సైకిల్ ను వినియోగిస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో బస్సులున్నా, భయంతో ఎక్కడికైనా వీటిపైనే వెళుతున్నారు. దీంతో పాటు ఇంటి నిర్మాణంతో పాటు పలు రకాలైన కూలీ పనులకు వెళ్లే వారు సైతం మోటారు సైకిల్ వాడటం ఆనవాయితీగా వచ్చింది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే వీరిపైనే అదనపు భారం పడుతుందని వారంతా ఆందోళన చెందుతున్నారు. ఇక డీజిల్ విషయానికొస్తే నాలుగు నెలలుగా పనుల్లేక ఆటోలను తిప్పడం లేదు. జనాలు ఎక్కడికి ఇతర ప్రాంతాలకు వెళ్లకపోవడంతో ఈ పరిస్థతి వచ్చింది. వీరిపైనా అదనపు భారం పడుతుందని ఆటో యాజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ను సవరించింది. పెట్రోల్‌పై రూ. 1.24, డీజీల్‌పై రూ. 0.93 పైసల చొప్పున వ్యాట్‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏపీ వ్యాట్ చట్టం 2005ను సవరిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దీనితో పెట్రోల్‌పై 31 శాతం పన్నుతో పాటు రూ. 4 అదనంగా సుంకాన్ని, అలాగే డీజీల్‌పై 22 శాతం వ్యాట్‌తో పాటు రూ. 4 అదనంగా సుంకాన్ని విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
కరోనా వైరస్ కారణంగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పడిపోవడంతోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సుమారు రూ. 4480 కోట్ల మేర రావాల్సిన రెవన్యూ ప్రస్తుతం రూ. 1323 కోట్లు మాత్రమే వస్తోందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుత పెంపుదల 2015-18 సంవత్సరాల మధ్య వసూలు చేసిన ప్రకారమే ఉందని ప్రభుత్వం తెలిపింది.