Anantapur: అనంతపురంలో విషాదం.. కబడ్డీ ఆడుతూ గుండెపోటుతో 19ఏళ్ల యువకుడు మృతి

Anantapur: ఈ నెల 1న కబడ్డీ ఆడుతూ కుప్పకూలిన విద్యార్థి తనూజ్ నాయక్‌

Update: 2023-03-07 11:45 GMT

Anantapur: అనంతపురంలో విషాదం.. కబడ్డీ ఆడుతూ గుండెపోటుతో 19ఏళ్ల యువకుడు మృతి

Anantapur: అనంతపురంలో విషాదం చోటుచేసుకుంది. కబడ్డీ ఆడుతూ గుండెపోటుతో 19ఏళ్ల యువకుడు మృతి చెందాడు. పీవీకేకే కాలేజీలో బీఫార్మసీ ఫస్టియర్‌ చదువుతున్న విద్యార్థి తనూజ్ నాయక్.. ఈ నెల 1న కబడ్డీ ఆడుతూ కుప్పకూలాడు. హుటాహుటిన అతడిని బెంగళూరు ఎమ్మెస్‌ రాజయ్య హాస్పిటల్‌కు తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ తనూజ నాయక్‌ ఇవాళ మృతి చెందాడు. మృతుడి స్వస్థలం మడకశిర మండలం అచ్చంపల్లితాండగా గుర్తించారు. ఇక.. కొడుకు మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Tags:    

Similar News