Tirupati: పొలాల్లోకి దూసుకెళ్లిన టాటా సుమో.. ఏడుగురికి గాయాలు

Tirupati: నెల్లూరు రొట్టెల పండగకు హాజరై వస్తుండగా ప్రమాదం

Update: 2023-07-31 13:56 GMT

Tirupati: పొలాల్లోకి దూసుకెళ్లిన టాటా సుమో.. ఏడుగురికి గాయాలు 

Tirupati: తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నాయుడుపేట నేషనల్ ‍హైవే పై టాటా సుమో వాహనం అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. బాధితులు సత్యసాయి జిల్లా కదిరి తాలూకా పెద్దపల్లి గ్రామనికి చెందిన వారిగా తెలుస్తోంది. జిలాని సాహెబ్ కుటుంబం నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగకు వెళ్లి స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News