Registrations in AP Secretariat: సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్.. ప్రయోగాత్మకంగా గుంటూరు జిల్లా ఎంపిక

Registrations in AP Secretariat: ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అన్ని పనులను గ్రామ సచివాలయాల ద్వారా చేస్తుండటంతో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ల పనులను ఇక్కడ నుంచే.

Update: 2020-07-14 05:30 GMT
Registrations

Registrations in AP Secretariat: ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అన్ని పనులను గ్రామ సచివాలయాల ద్వారా చేస్తుండటంతో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ల పనులను ఇక్కడ నుంచే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా ప్రయోగాత్మకంగా గుంటూరు జిల్లాలో కాజ సచివాలయం ఎంపికయ్యింది. ఈ ప్రక్రియ సజావుగా సాగితే రిజిస్ట్రేషన్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే సమస్యల నుంచి ప్రజలు బయటపడే అవకాశం ఉంటుంది. ఖర్చులు తగ్గే వీలుంటుంది. దీంతో పాటు సమయం కలిసి వస్తుందని ప్రజలు భావిస్తున్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో భూములు, స్థలాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15, 16 తేదీల్లో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో భూములు, స్థలాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15, 16 తేదీల్లో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రయోగాత్మకంగా చేపట్టే ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా కాజ సచివాలయం ఎంపికైంది.

ఇక్కడ పరిశీలన అనంతరం రాష్ట్రంలోని మిగిలిన చోట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. గత కొద్ది రోజులుగా సచివాలయాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ఎవరు చేయాలనే అంశంపై ఇటు రిజిస్ట్రేషన్‌, అటు ప్రభుత్వవర్గాల్లో అయోమయం నెలకొంది. తాజాగా దీనిపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం ప్రయోగాత్మక కార్యక్రమం కావడంతో సబ్‌రిజిస్ట్రార్‌ ఆధ్వర్యంలోనే సచివాలయంలో ఈ ప్రక్రియ నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది.

దస్తావేజుకు సంబంధించిన చెక్‌స్లిప్‌లు కొట్టడానికి, మార్కెట్‌ ధరలు పక్కాగా నమోదు చేశారా? లేదా? అనేవి పరిశీలించే పనులకు మాత్రం సచివాలయాల్లోని ఇతర సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని సూచించింది. ఈ మేరకు అవసరమైన నెట్‌వర్కింగ్‌ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది.


Tags:    

Similar News