అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల వాకౌట్
గవర్నర్ ప్రసంగం సందర్బంగా అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ.. నిరసనగా సభనుంచి వాకౌట్ చేసింది టీడీపీ.
గవర్నర్ ప్రసంగం సందర్బంగా అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ.. నిరసనగా సభనుంచి వాకౌట్ చేసింది టీడీపీ. అంతకుముందు అసెంబ్లీ ప్రారంభం అయ్యేముందే అసెంబ్లీ ఆవరణలో టీడీపీ సభ్యులు నిరసన తెలియజేశారు. అసెంబ్లీకి కూడా టీడీపీ సభ్యులు నల్లచొక్కాలతో వచ్చారు. మరోవైపు ప్రజా సమస్యలు చాలానే ఉన్నాయన్న టీడీపీ అసెంబ్లీ సమావేశాలను 15 రోజులపాటు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది.
కాగా ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి ఆన్‌లైన్ ద్వారా ప్రసంగించారు. ఆ వెంటనే, గవర్నర్ ప్రసంగంపై ధన్యావాదాలు తెలిపే తీర్మానం ఆమోదించారు తర్వాత ఉభయసభల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2 లక్షల 28 వేల కోట్లకు పైగా ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో నవరత్నాలు అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.