Nio natical ambulance in AP: ఏపీలో ప్రత్యేకంగా పిల్లల కోసం నియో నాటికల్ అంబులెన్స్

Nio natical ambulance in AP: పెద్దవారికి 108, 104 మాదిరిగా పిల్లల కోసం ప్రత్యేకంగా నియో నాటికల్ అంబులెన్స్ లను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Update: 2020-07-03 03:15 GMT

Nio natical ambulance in AP: పెద్దవారికి 108, 104 మాదిరిగా పిల్లల కోసం ప్రత్యేకంగా నియో నాటికల్ అంబులెన్స్ లను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాడేపల్లిలో వైఎస్సార్ పార్టీ ఎమ్మెల్యే పార్ధసారధి అన్నారు. ఈ అంబులెన్స్లో పిల్లల వ్యాధులకు సంబంధించిన కేర్ యూనిట్లు ఉంటాయని పేర్కొన్నారు. చిన్నారులకు ఆదప సంభవించినప్పుడు దాదాపుగా సగం వైద్యం వీటిలోనే పూర్తి చేసేలా అవసరమైన పరికరాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు.

108,104 అంటే గుర్తుకు వచ్చేది దివంగత నేత రాజశేఖర్ రెడ్డి అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. తాడేపల్లిలో గురువారం ఆయన మాట్లాడుతూ, ' ప్రతి మండలానికి 108, 104 ముఖ్యమంత్రి జగన్ ఏర్పాటు చేశారు. పట్టణాల్లో 15, గ్రామాల్లో 20, ఏజెన్సీలో 25 నిమిషాల్లో 108 చేరుకుంటుంది. పేదల ప్రాణాల విలువ తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి. చంద్రబాబు ఉక్రోషంతో 104, 108లో అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారు.108,104 లకు 203 కోట్లు ఖర్చు చేస్తే 307 కోట్లు అవినీతి జరిగిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు' అని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ... 'పెద్దలకే కాదు చిన్న పిల్లలు కోసం నియో నానిటల్ అంబులెన్స్ ను తొలిసారిగా ఏర్పాటు చేశారు. 1800 వాహనాలు ఏర్పాటు చేశామని చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. 1800ల 108, 104 వాహనాలు ఎక్కడ ఏర్పాటు చేశారో చూపించాలని సవాల్ చేస్తున్నా. దివంగత నేత రాజశేఖర్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశ్యంతో 104, 108 వ్యవస్థ ను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. చంద్రబాబు హయాంలో 108, 104 షెడ్లకు పరిమితమయ్యాయి. డీజల్ లేక మధ్యలోనే పేషంట్లతో 108 వాహనాలు ఆగిపోయేవి. ఆరోగ్యశ్రీలో వ్యాధుల సంఖ్యను 2000లకు సీఎం జగన్ పెంచారు. ఐదు లక్షల ఆదాయం ఉన్నా సరే పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందిస్తున్నారు. ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వం 28 వేల కోట్లు ఖర్చు చేసిందని ఎమ్మెల్యే పార్ధసారధి చెప్పుకొచ్చారు.


Tags:    

Similar News