జేసీ ప్రభాకరరెడ్డి, అస్మిత్ రెడ్డిలకు కోవిడ్ పరీక్షలు..అనంతపురంలో పవన్ రెడ్డిని కలిసిన లోకేష్

అనంతపురంలో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. జేసీ ప్రభాకరరెడ్డి, ఆయన కుమారుడు అరెస్టు చేసిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు చంద్రబాబు తనయుడు లోకేష్ అనంతరపురం వెళ్లాడు

Update: 2020-06-15 09:19 GMT

అనంతపురంలో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. జేసీ ప్రభాకరరెడ్డి, ఆయన కుమారుడు అరెస్టు చేసిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు చంద్రబాబు తనయుడు లోకేష్ అనంతరపురం వెళ్లాడు. అక్కడ పవన్ రెడ్డిని కలిపి తన మద్దతు తెలియజేశారు.

దివాకర్ ట్రావెల్స్ వాహనాల రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టైన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డికి కరోనా పరీక్షలు నిర్వహించారు అధికారులు. కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వీరికి వైద్య సిబ్బంది స్వాబ్ పరీక్షలు చేశారు. కాగా వీటికి సంబంధించిన ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.

కాగా నేడు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ పరామర్శించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వారి ఇంటికి వెళ్లిన ఆయన దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డితో సమావేశం అయ్యారు. కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కడప జైలులో ఉన్న ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను కలిసేందుకు లోకేష్ అధికారులను అనుమతి కోరగా.. ప్రస్తుతం కొవిడ్-19 నిబంధనల కారణంగా వీలుకాదంటూ అనుమతిని నిరాకరించారు.

Tags:    

Similar News