ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు ప్రకటనపై జాతీయ స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. అధికార వికేంద్రీకరణతో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. అమరావతి ప్రజా రాజధాని అనేది పెద్ద భూ కుంభకోణమని ఆరోపించారు.
అమరావతిని సింగపూర్ చేస్తామమని చెప్పిన చంద్రబాబు అమలు చేయలేకపోయారన్నారు. రాజధానితో చంద్రబాబు వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో చంద్రబాబు ఆయన బినామీలు పెద్ద ఎత్తున భూములు కొన్నారని పేదల భూములను భయపెట్టి టీడీపీ నాయకులు భూములు లాక్కున్నారని ఆరోపించారు. కావాలనే నిరసన కార్యక్రమాలుచేపడుతున్నారని విమర్శించారు. అన్ని ప్రాంతాలు బాగుండాలని సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంబటి చెప్పారు.