ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ

Update: 2020-05-15 16:49 GMT

కరోనా కట్టడిలో ప్రభుత్వాలకు బాసటగా నిలిచేందుకు పలువురు పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారు.. కోవిడ్‌-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి భారిగా విరాళాలు అందుతున్నాయి.. విశాఖపట్నం పోర్ట్‌ ట్రస్ట్‌ రూ. 75,00,000 విరాళం అందించింది. ఈ డబ్బును చెక్‌ రూపంలో విశాఖపట్నం పోర్ట్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ కే. రామమోహన్‌ రావు తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ని కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. మరోవైపు ఏపీ ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్ కూడా‌ రూ. 50,00,000 విరాళం అందించింది.    

Tags:    

Similar News