టీడీపీ ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్‌పై విచారణ

Update: 2020-06-03 17:05 GMT

పార్టీ విప్‌ ఉల్లంఘించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్సీలు శివనాథరెడ్డి, పోతుల సునీతల అనర్హత పిటిషన్‌పై శాసనమండలిలో బుధవారం విచారణ జరిగింది. ఈ మేరకు వారిపై అనర్హత వేటు వేయాలని టీడీపీ ఎమ్మెల్సీలు చేసిన ఫిర్యాదుపై మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ విచారణ చేపట్టారు. జనవరిలో జరిగిన శాసనమండలి సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు సంబంధించి టీడీపీ అధిష్ఠానం ఎమ్మెల్సీలు అందరికీ విప్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌పై జరిగిన ఓటింగ్‌లో ఎమ్మెల్సీలు శివనాథరెడ్డి, పోతుల సునీతలు పార్టీ విప్‌నకు వ్యతిరేకంగా వ్యవహరించారని టీడీపీ ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, అశోక్‌బాబు మండలి ఛైర్మన్‌కు అప్పట్లో ఫిర్యాదు చేశారు.

దీనిపై విచారణకు హాజరు కావాలన్న ఛైర్మన్‌ ఆదేశాల మేరకు బుద్ధా వెంకన్న, అశోక్‌బాబు బుధవారం చైర్మన్ ఎదుట తమ వాదనలు వినిపించారు. అయితే, కొన్ని కారణాల రీత్యా విచారణకు హాజరు కాలేకపోతున్నామని పోతుల సునీత, శివనాథ రెడ్డిలు ఛైర్మన్‌కు తెలియజేశారు. ఆమేరకు ఈ విషయాన్ని చైర్మన్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీలకు విషయం చెప్పారు. దీంతో ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు సాకులు చెప్పి విచారణకు హాజరుకాలేదని.. వారిపై వెంటనే అనర్హత వేటు వేయాలని బుద్ధావెంకన్న మండలి ఛైర్మన్‌ని కోరారు.  

Tags:    

Similar News