Degree and PG Exams in AP: డిగ్రీ, పీజీ పరీక్షలు ఎప్పుడో తెలుసా?
Degree and PG Exams in AP: కరోనా వైరస్ పుణ్యమాని విద్యా వవస్థ అంతా అతలాకుతలం అయ్యిందనే చెప్పాలి.
Degree and PG Exams in AP: కరోనా వైరస్ పుణ్యమాని విద్యా వవస్థ అంతా అతలాకుతలం అయ్యిందనే చెప్పాలి. ఏ పరీక్షలున్నాయో, ఏవి లేవో తెలియని దుస్థితి. ఒక వేళ నిర్వహిద్దామని భావించినా, దానికి తగ్గట్టు పరిస్థితులు లేకపోవడంతో ఏ కొంప మునుగుతుందోనని ప్రభుత్వాల ఆందోళన. ఇలాంటి పరిస్థితుల్లో యూజీసీ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం ఆదేశించడంతో ఏపీ ప్రభుత్వం దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే గవర్నర్ ఆయా యూనివర్సిటీల చాన్స్ లర్, వైఎస్ చాన్స్ లర్స్ తో వీడియో కాన్స్ రెన్స్ నిర్వహించారు. అయితే వీటిని సెప్టెంబరులో నిర్వహిస్తే బావుంటుందనే అభిప్రాయం అందరూ వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఆ దిశగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం కోవిద్ తీవ్రంగా ఉండటం, ఇది వచ్చే నెల చివరి వరకు ఉంటుందని పలువురు చెప్పడంతో సెప్టెంబరులో ఈ పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం పరీక్షలను తప్పనిసరిగా నిర్వహించాలని యూజీసీ స్పష్టం చేయడంతో ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో.. అన్ని జాగ్రత్తలను తీసుకుంటూ పరీక్షలను నిర్వహించేలా ప్రణాళికలను రూపొందిస్తోంది. సెప్టెంబర్ 13 నుంచి 27 మధ్యలో ఎంసెట్‌తో పాటు డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం సెమిస్టర్ పరీక్షలను కూడా నిర్వహిస్తామని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి తెలిపారు.
కరోనా వైరస్ కారణంగా ఆకడిమిక్ కరిక్యులమ్ రీ-డిజైన్ చేస్తున్నామన్న ఆయన.. ఈ ఏడాది నుంచి డిగ్రీలో 10 నెలల పాటు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేస్తున్నామన్నారు. అటు కోవిడ్ కారణంగా డిగ్రీ, పీజీ పరీక్షలకు హాజరుకాలేని విద్యార్ధులకు మరోసారి ఎగ్జామ్స్ నిర్వహిస్తామని హేమచంద్రారెడ్డి వెల్లడించారు.