S.Rayavaram: కోస్టల్ గోల్డ్ సమీప గ్రామాలలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలి
ధర్మవరంలోని కోస్టల్ గోల్డ్ ( రొయ్యల ఫ్యాక్టరీ) వారు ధర్మవరంలో చేపట్టిన మాదిరిగానే సమీప గ్రామాలలోనూ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని మాజీ ఉప సర్పంచి సియ్యాదుల అచ్యుత్ కూమార్ విజ్ఞప్తి చేశారు.
ఎస్.రాయవరం: ధర్మవరంలోని కోస్టల్ గోల్డ్ ( రొయ్యల ఫ్యాక్టరీ) వారు ధర్మవరంలో చేపట్టిన మాదిరిగానే సమీప గ్రామాలలోనూ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని మాజీ ఉప సర్పంచి సియ్యాదుల అచ్యుత్ కూమార్ విజ్ఞప్తి చేశారు. డెక్కన్ కెమికల్స్ కంపెనీ వారు అక్కడి సమీప గ్రామాలలో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారని, అదే విధంగా ఇక్కడి కోస్టల్ గోల్డ్ కంపెనీ కూడా ద్రావణాన్ని స్ప్రే చేయించాలని అన్నారు.
తమ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండీ ఇక్కడి ఉద్యోగ విధులు నిర్వహించడానికి వస్తున్నారని గుర్తు చేశారు. కావున సిఎస్సార్ లో భాగంగా పారిశుద్ధ్య పనులు చేపట్టి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. గత రెండు రోజుల క్రితమే నర్సీపట్నం రెడ్ జోన్ గా ప్రకటించబడిన దృష్ట్యా వీలైనంత త్వరగా పై కార్యక్రమాన్ని చేపట్టాలని విన్నవించారు. ఇటీవల ఇంటింటికీ కూరగాయలు పంపిణీ చేసినందుకు ఈ సందర్భంగా అచ్యుత్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.