మహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ చంద్రబాబు

TDP Mahanadu 2022: మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Update: 2022-05-28 15:04 GMT

మహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ చంద్రబాబు

TDP Mahanadu 2022: మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 'క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్' అనే నినాదం ఇచ్చారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, పోలీసులూ మీ గాలి కూడా తీస్తా జాగ్రత్తగా ఉండండని హెచ్చరించారు. 'ఈ రోజు ఒక యుగపురుషుడు పుట్టిన రోజుని, మనం తెలుగు వారి పౌరుషానికి ప్రతీక అయిన ఎన్టీఆర్‌‌కు వారసులమన్నారు.

ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్లీ ఈ భూమ్మీద పుట్టడని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులోనూ ఆయన రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరని చెప్పారు. జగన్ ప్రభుత్వం బాలయ్య సినిమా ఆడొద్దని ఆంక్షలు పెట్టిందని స్పెషల్ షోకు అనుమతులు ఇవ్వలేదన్నారు. గడప గడపకు మన ప్రభుత్వంలో ధరలను పెంచిన నాయకులను ప్రజలు నిలదీయాలని ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారని ప్రశ్నించాలని సూచించారు.

Tags:    

Similar News