సీఎం జగన్ 100 రోజుల పాలనపై చంద్రబాబు కామెంట్స్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అధికార పగ్గాలు చేపట్టి నేటి 100 రోజులు పూర్తయ్యింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ సర్కార్‌పై మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు.

Update: 2019-09-06 02:57 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అధికార పగ్గాలు చేపట్టి నేటి 100 రోజులు పూర్తయ్యింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ సర్కార్‌పై మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినా వైసీపీ ప్రభుత్వం 100 రోజుల పాలన అప్రతిష్ఠను మూటకట్టుకుందని.. ఇది విధ్వంసకర ప్రభుత్వం అని నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.

టీడీపీ కార్యకర్తలపై వైసీపీ సర్కారు అకృత్యాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. పిఠాపురం, తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారని వివరించారు. నెలలు గడుస్తున్నా కానీ తన బాబాయిని ఎవరు హత్య చేశారో తేల్చలేదని అన్నారు. పులివెందుల పంచాయితీని రాష్ట్రం మొత్తం రుద్దాలని చూస్తున్నారని ఆరోపించారు. జగన్‌కు దమ్ముంటే తన బాబాయ్‌ని చంపిన నిందితులను బయటపెట్టాలని సవాల్ విసిరారు. చేతకాకుంటే కేసు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News