Atchannaidu Arrest: అచ్చెన్నాయుడిని కిడ్నాప్‌ చేశారు: చంద్రబాబు

Update: 2020-06-12 05:16 GMT

టీడీపీ నేత అచ్చెన్నాయుడి అరెస్టుపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు భగ్గుమన్నారు. ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. అచ్చెన్న అరెస్ట్ నేపథ్యంలో పార్టీ నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం చేస్తున్న మోసాలపై నిరంతరం పోరాడుతున్న అచ్చెన్నాయుడిపై జగన్‌ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. దాదాపు 100 మంది పోలీసులు అర్ధరాత్రి ఆయన ఇంటిపై దాడి చేసి కిడ్నాప్‌ చేశారని ఆరోపించారు. కనీసం మందులు వేసుకోవడానికి కూడా అనుమతించలేదని, వారి కుటుంబ సభ్యులు ఫోన్‌లో కాంటాక్ట్‌ చేసినా ఫోన్‌ అందుబాటులో లేకుండా చేశారని తెలిపారు. జగన్‌ ఉన్మాదం, పిచ్చి పరాకాష్ఠకు చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అచ్చెన్నాయుడు కిడ్నాప్‌కు సీఎం జగన్‌ బాధ్యత వహించాలని.. ఆయన ఆచూకీని డీజీపీ వెంటనే వెల్లడించాలన్నారు. ఈ విషయంలో హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అచ్చెన్నాయుడిని ఎక్కడికి తీసుకెళ్లారో, ఎందుకు తీసుకెళ్లారో తెలియదని.. అరెస్ట్ చేసేందుకు ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదని చంద్రబాబు మండిపడ్డారు. ఈ దుర్మార్గానికి, ఉన్మాద చర్యకు నిరసనగా బడుగు బలహీనవర్గాల ప్రజలు నిరసనలు తెలియజేయాలి. జ్యోతిరావుపూలే, అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించి నిరసన తెలియజేయాలి అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News