భద్రాచలం కరకట్టను పరిశీలించిన చంద్రబాబు
Bhadrachalam: 20ఏళ్ల క్రితం టీడీపీ హయాంలో కరకట్ట నిర్మాణం
Bhadrachalam: ఏపీ, తెలంగాణ సరిహద్దులోని వీలిన మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. భద్రాచలంలో కరకట్టను చంద్రబాబు పరిశీలించారు. ఇటీవల వచ్చిన వరద పరిస్థితిపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. భద్రాచలంలో వరద ముప్పు నుంచి ప్రజల్ని కాపాడేందుకు టీడీపీ హయాంలో 20 ఏళ్ల క్రితం కరకట్ట నిర్మించామని దాని వల్లే ఇప్పుడు పట్టణమంతా సురక్షితంగా ఉందన్నారు. భవిష్యత్తులోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, చిన్నపాటి లోటుపాట్లను ప్రభుత్వం శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. విలీన గ్రామాల్లో కరకట్టల నిర్మాణం చేపట్టి బాధిత ప్రజలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని చంద్రబాబు సూచించారు.