ఏపీలో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టాలి : బీజేపీ ఎమ్మెల్సీ

13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కాస్తా త్వరలోనే...25 జిల్లాలుగా మారనున్నట్లు ప్రభుత్వం ముందస్తు సంకేతాలు ఇచ్చేసింది. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలను గమనిస్తే.. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముహూర్తం ఖరారు అయినట్టు స్పష్టమవుతోంది.

Update: 2020-06-24 14:47 GMT

13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కాస్తా త్వరలోనే...25 జిల్లాలుగా మారనున్నట్లు ప్రభుత్వం ముందస్తు సంకేతాలు ఇచ్చేసింది. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలను గమనిస్తే.. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముహూర్తం ఖరారు అయినట్టు స్పష్టమవుతోంది. దీనిపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తన వైఖరి ఇంకా తెలియజేయలేదు. కానీ బీజేపీ మాత్రం స్వాగతించింది. కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యానించారు. అయితే

కొత్త జిల్లాల పరిపాలనకు తెలంగాణ బ్యాడ్ ఎగ్జాంపుల్ అని అక్కడ సరైన ప్రణాళిక లేకుండా జిల్లాలు ఏర్పాటు చేసి పాలన అస్తవ్యస్తం చేశారన్నారు.

ప్రస్తుతం అక్కడ అద్దె భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు నడుస్తున్నాయని ఇందుకు తగినంతగా సిబ్బంది కూడా లేరని అన్నారు. ఈ క్రమంలో ఏపీలో జగన్.. తెలంగాణ తప్పిదాలను చూసి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఐఎఎస్ ల నుంచి కిందిస్థాయి వరకు సిబ్బందిని పెంచాలన్నారు. మౌలిక వసతులు కల్పిస్తేనే కొత్త జిల్లాలతో పరిపాలన వికేంద్రీకరణ సాధ్యం అవుతుందని విశాఖలో ఓ జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని సలహా ఇచ్చారు మాధవ్. 


Tags:    

Similar News